సాధారణంగా ప్రముఖులు, సినీతారలు ఎప్పుడైనా బయట కనిపిస్తే చుట్టూ జనం చేరి నానా హంగామా చేస్తారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడతారు. అయితే ఇలాంటి సంఘటన ఎదుర్కొన్న రకుల్‌ప్రీత్ సింగ్ మాత్రం అవాక్కైంది. ముంబయిలో ఓ రెస్టారెంటు నుంచి బయటకు వస్తున్న ఆమెను కొంత మంది వీధి బాలికలు అడ్డుకున్నారు.
కాసేపు ఆమెను వెళ్లనివ్వకుండా హడావుడి చేశారు. పాపం రకుల్ ఓపిగ్గా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ వాళ్లు ఎంతకీ వదలకపోగా... కాస్త చికాకుతో కారెక్కి వెళ్లిపోయింది.