భూమాత పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాలని ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కథానాయకుడు నాగచైతన్య విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆమె.. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటారు.
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: రకుల్ - రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటారు.
రకుల్
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఒకరు ఇద్దరు కాదు.. అందరం కలిసి భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు రకుల్. తన అభిమానులంతా హరిత సవాల్‌ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అలాగే మరో కథానాయిక నభా నటేష్ కూడా బెంగళూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామిగా నిలిచారు. బెల్లంకొడ సాయిశ్రీనివాస్, కథానాయికలు అను ఇమ్మాన్యుయేల్, నిధి అగర్వాల్‌కు హరిత సవాల్ విసిరారు.
ఇదీ చూడండి :