తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రక్షిత్ 'శ్రీమన్నారాయణ' చిత్ర ట్రైలర్ విడుదల - rakshith shetty movie athade srimannarayana trailer release

రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం 'అతడే శ్రీమన్నారాయణ'. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. శాన్వీ కథానాయిక. డిసెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

rakshith shetty  movie athade srimannarayana trailer release
అతడే శ్రీమన్నారాయణ

By

Published : Nov 28, 2019, 5:13 PM IST

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం 'అవనే శ్రీమన్నారాయణ'. ఈ సినిమా తెలుగులో 'అతడే శ్రీమన్నారాయణ' పేరుతో రానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'లవ్లీ' ఫేమ్ శాన్వీ కథానాయిక.

పీరియడ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అవినీతి పోలీసు అధికారి పాత్రలో రక్షిత్ కనిపించనున్నాడు. సచిన్ రవి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా... డిసెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్భుతమైన విజువల్స్​తో ట్రైలర్ ఎంతో బాగుందని టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు.

2016లో కిరిక్ పార్టీలో చివరగా నటించాడు రక్షిత్. ఆ సినిమా సమయంలోనే హీరోయిన్​ రష్మికా మందణ్నతో ప్రేమ, నిశ్చితార్థం వరకు వెళ్లాడు. అయితే 2018లో వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.

ఇదీ చదవండి: ఈ కుర్రాడు ఛార్మికి 'ఎనర్జిటిక్​'​గా కనిపించాడట..!

ABOUT THE AUTHOR

...view details