బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న చిత్రం 'రాక్షసుడు'. టీజర్ ఇవాళ విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. 'రాట్సాన్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న 'రాక్షసుడు' జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సైకోకిల్లర్ వేటలో... 'అల్లుడు శ్రీను' - టీజర్
'రాట్సాన్' అనే తమిళ సినిమా తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ నేడు విడుదలైంది. జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
![సైకోకిల్లర్ వేటలో... 'అల్లుడు శ్రీను'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3440734-thumbnail-3x2-rakh.jpg)
రాక్షసుడు
15 ఏళ్ల టీనేజి అమ్మాయిలను ఓ సైకోకిల్లర్ కిరాతకంగా చంపుతుంటాడు. అతడిని పట్టుకునే పోలీసు అధికారి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. గత ఏడాది తమిళంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. నాజర్, రమ్యకృష్ణ, అలీ, షాయాజీషిండే, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.