తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాక్షసుడు ట్రైలర్: వరుస హత్యలు చేస్తుందెవరు..? - రాక్షసుడు సినిమా

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన 'రాక్షసుడు' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్​లో మరోసారి పోలీస్​గా కనిపించనున్నాడీ హీరో. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాక్షసుడు ట్రైలర్: హత్యలు చేస్తున్న హంతకుడెవరు?

By

Published : Jul 18, 2019, 6:01 PM IST

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించినసస్పెన్స్ థ్రిల్లర్​ చిత్రం 'రాక్షసుడు'. కథానాయకుడు పోలీస్​ పాత్రలో కనిపించనున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​గా నటించింది. గురువారం ట్రైలర్​ను విడుదల చేశారు. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.

నగరంలో వరుసగా టీనేజ్​ అమ్మాయిలు హత్యకు గురవుతుంటారు. ఇంతకీ వాటిని ఎవరు చేస్తున్నారు. ఆ హంతకుడు ఎవరనేది సస్పెన్స్​గా ఉంచారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తమిళ చిత్రం 'రాట్ససన్'కు ఇది రీమేక్​.

హవీష్ ప్రొడక్షన్ బ్యానర్​పై సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరించారు. రమేశ్​ వర్మ దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న 'అల్లుడు శ్రీను'కు ఈ సినిమా అయినా కలిసొస్తుందేమో చూడాలి.

ఇది చదవండి: నీటి ఆదా కోసం దర్శకుడి 'వన్ బకెట్ ఛాలెంజ్'

ABOUT THE AUTHOR

...view details