రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా.. 'రంగ్ దే బసంతి', 'భాగ్ మిల్కా భాగ్' చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. రీల్ లైఫ్లో మెగాఫోన్ పట్టిన ఈ డైరెక్టర్.. నిజ జీవితంలో హీరో అయ్యాడు. ముంబయి మురికి వాడల్లో మరుగుదొడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం టాయ్లెట్లు కట్టించాడు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 మరుగుదొడ్లు నిర్మించి వారి మనసులను గెల్చుకున్నాడు. మరుగుదొడ్డి సౌకర్యం లేక నిరుపేదలు పడుతున్న అవస్థలపై మేరే ప్యారే ప్రైమ్మినిస్టర్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ముంబయి మురికి వాడల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లారా చూసి చలించాడు ప్రకాశ్ మెహ్ర.