తన తమ్ముడు అశ్విన్ను హీరోగా నిలబెట్టేవరకు ఒంటిపై తెల్లచొక్కా తీయనని అంటున్నాడు దర్శకుడు ఓంకార్. తండ్రి చనిపోయాక తెల్లవస్త్రాలు ధరించడం అలవాటు చేసుకున్నానని చెప్పిన ఈ డైరక్టర్... 'రాజు గారి గది-3'ను ఎంతో కష్టపడి తీసినట్లు తెలిపాడు.
అప్పటివరకు ఈ డ్రస్ మార్చను: ఓంకార్ - ఓంకార్ దర్శకుడు
హైదరాబాద్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో 'రాజుగారి గది-3' చిత్రబృందం సందడి చేసింది. అనంతరం సినిమా విశేషాలను పంచుకున్నాడు దర్శకుడు ఓంకార్.
దర్శకుడు ఓంకార్
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి 'రాజుగారి గది-3' విశేషాలను వెల్లడించారు. అశ్విన్, అవికాగోర్ జంటగా నటించిన ఈ చిత్రంలో అలీ, ధన్రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
ఇది చదవండి: ట్రైలర్: భయపెడుతోన్న 'రాజుగారి గది 3'