ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం కోలీవుడ్లో చాలా కాలం తర్వాత ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. శర్వానంద్ హీరోగా తమిళంలో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. గతంలో శర్వా కూడా కోలీవుడ్లో ఒక మూవీలో నటించాడు. తెలుగులో ఇది రాజాధిరాజాగా విడుదలైంది. ఇక సుందరం మాస్టర్ 2008లో ఏగన్ అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కించాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శర్వాను డైరెక్ట్ చేయడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
సుందరం మాస్టర్ దర్శకత్వంలో శర్వా! - telugu cinema news
శర్వానంద్ హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. చాలా సంవత్సరాల తర్వాత సుందరం మాస్టర్ సినిమా డైరక్ట్ చేయడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
![సుందరం మాస్టర్ దర్శకత్వంలో శర్వా! raju sundaram master direction with sharvanand at kollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6529872-225-6529872-1585057200899.jpg)
సుందరం మాస్టర్ దర్శకత్వంలో శర్వా..!
ఇటీవల 'జాను' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్.. ప్రస్తుతం 'శ్రీకారం' చిత్రంలో నటిస్తున్నాడు. అనంతరం అజయ్ భూపతి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. ఈ చిత్రాల తర్వాత సుందరంతో కలిసి పనిచేస్తాడేమో చూడాలి మరి.