యంగ్ హీరో రాజ్ 'తరుణ్' హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం '‘ఇద్దరి లోకం ఒకటే'’. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 9న ఈ సినిమా విడుదల కానుందని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన 'షాలినీ పాండే' హీరోయిన్గా నటిస్తోంది. కొద్ది కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడీ హీరో. గతేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో.