రాజ్‌తరుణ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం 'అనుభవించు రాజా'(anubhavinchu raja raj tarun movie). శ్రీను గావిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం(సెప్టెంబరు 23) ఉదయం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్(rrr ram charan movie) సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రాజ్‌తరుణ్(raj tarun anubhavinchu raja) కోడిపందెలు అంటే ఆసక్తి కనబరిచే బంగారం అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. కషికా ఖాన్ హీరోయిన్. పోసాని కృష్ణ మురళీ, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపీ సుందర్ స్వరాలు అందిస్తున్నారు.
రిలీజ్ డేట్
మలయాళీ సినిమా 'మిన్నల్ మురళి'(minnal murali movie release date) రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబరు 24నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. టొవినొ థామస్ ప్రధాన పాత్రలో నటించగా.. బేసిన్ జోసఫ్ దర్శకత్వం వహించారు. సోఫియా పాల్ నిర్మాతగా వ్యవహరించారు.