తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రమాదంపై స్పందించిన నటుడు రాజశేఖర్

నటుడు రాజశేఖర్.. తనకు జరిగిన కారు ప్రమాదంపై స్పందించాడు. తనకేం కాలేదని క్షేమంగానే ఉన్నానని చెప్పాడు.

By

Published : Nov 13, 2019, 10:17 AM IST

ప్రమాదంపై స్పందించిన నటుడు రాజశేఖర్

మంగళవారం రాత్రి హైదరాబాద్​లో రాజశేఖర్​కు పెను ప్రమాదం తప్పింది. కారు బోల్తా పడిన ఘటనలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం వల్ల స్వల్పగాయలతో బయటపడ్డాడు. ఇప్పుడీ విషయంపై స్పందించాడు. క్షేమంగా ఉన్నానని ఈ నటుడు చెప్పుకొచ్చాడు.

"మంగళవారం రాత్రి రామోజీఫిల్మ్​ సిటీ నుంచి ఇంటి వస్తుండగా ఔటర్ రింగ్​రోడ్​ పెద్ద గోల్కోండ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా దగ్గరకు వచ్చారు. నన్ను గుర్తించి విన్​షీల్డ్​లో నుంచి బయటకు లాగారు. అప్పుడు వారి ఫోన్ తీసుకుని పోలీసులకు, నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. నాకు ఎటువంటి గాయాలు కాలేదు" -రాజశేఖర్, హీరో

ఇది చదవండి: నటుడు రాజశేఖర్‌కు తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details