సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న చిత్రం 'దర్బార్'. ఇటీవలే మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులను అలరిస్తూ అంచనాల్ని పెంచేస్తోంది. ఇప్పుడు తన పాత్రకు డబ్బింగ్ ప్రారంభించాడు రజనీ. ఈ విషయాన్ని దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ట్వీట్ చేశాడు.
'ఆదిత్య అరుణాచలం' డబ్బింగ్ షురూ - దర్బార్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్
హీరో రజనీకాంత్.. 'దర్బార్' సినిమాలోని తన పాత్ర ఆదిత్య అరుణాచలంకు డబ్బింగ్ మొదలుపెట్టాడు. ఇటీవలే ప్రిన్స్ మహేశ్‌బాబు చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
!['ఆదిత్య అరుణాచలం' డబ్బింగ్ షురూ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5061012-367-5061012-1573722845502.jpg)
సూపర్‌స్టార్ రజనీకాంత్
ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు రజనీకాంత్. తలైవా కూతురిగా నటి నివేదా థామస్, హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: రజనీకాంత్‌ను అంకుల్ అని పిలిచి.. ఆ తర్వాత ఆయనతోనే రొమాన్స్
Last Updated : Nov 14, 2019, 7:40 PM IST