కోలీవుడ్ ప్రముఖ హీరోలు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్‌లు గతంలో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. మళ్లీ వీరిద్దరూ మరోసారి కలిసి నటించే అవకాశం ఉందని సినీవర్గాలు సమాచారం. ఇటీవలే వచ్చిన 'ఖైదీ' దర్శకుడు లోకేశ్ కనక్‌రాజ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడట. ఈ విషయంపై స్పష్టత రావాల్సిన అవసరముంది.
కమల్, రజనీ.. మళ్లీ కలిసి నటించనున్నారా? - cinema vaarthalu
స్టార్ హీరోలు కమల్‌హాసన్-రజనీకాంత్.. మరోసారి కలిసి నటించే అవకాశముందట. ఈ సినిమాకు లోకేశ్ కనక్‌రాజ్ దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడని సమాచారం.
![కమల్, రజనీ.. మళ్లీ కలిసి నటించనున్నారా? కమల్‌హాసన్-రజనీకాంత్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5290273-919-5290273-1575634106742.jpg)
కమల్, రజనీలు మళ్లీ కలిసి నటిస్తారా?
ప్రస్తుతం రజనీకాంత్ 'దర్బార్'లో నటిస్తున్నాడు. తర్వాత శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. కమల్‌హాసన్ 'భారతీయడు 2'తో బిజీగా ఉన్నాడు. అనంతరం స్వీయ దర్శకత్వంలో 'తలైవన్ ఇరుకిరాన్' అనే సినిమా తీయనున్నాడు.
ఇది చదవండి: రజనీతో రాజకీయ మైత్రిపై కమల్ కొత్త పలుకు