సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'దర్బార్'. పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు తలైవా. సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఆడియో లాంచ్ నిర్వహించారు. అందులో పాల్గొన్న చిత్రబృందం సినిమా విశేషాలను పంచుకుంది.
"సుభాస్కరన్.. నాతో 'రోబో 2.0' చేశారు. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే మరో సినిమా చేయమని అడిగారు. అప్పుడు దర్శకుడు మురుగదాస్ నాకు గుర్తొచ్చాడు. అతడికి చెప్తే 'పేట' విడుదలైన తర్వాత ఒక వారంలోనే 'దర్బార్' కథతో నా దగ్గరకు వచ్చాడు. అలా ఈ సినిమా ప్రారంభమైంది. ఇందులో నయనతార.. 'చంద్రముఖి' కంటే గ్లామర్, ఎనర్జిటిక్‌గా కనపడుతుంది. అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఇళయరాజా.. సన్నివేశాలను స్క్రిప్ట్ పరంగా డెవలప్ చేయడం.. వాటికి సంగీతంతో ప్రాణం పోస్తారు. ఆ తర్వాత అలాంటి సెన్స్ అనిరుధ్లోనే చూశాను. తమిళనాడుకు వచ్చేటప్పుడు నాపై నమ్మకంతో, నన్ను ఇక్కడ అడుగు పెట్టించిన వారి నుంచి, నాపై నమ్మకంతో సినిమాలు రూపొందించిన దర్శక నిర్మాతలు అందరి నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు. ఇప్పుడు 'దర్బార్'తో మీ నమ్మకాన్ని వమ్ము చేయను. డిసెంబర్ 12న నా పుట్టిన రోజు అభిమానులు సెలబ్రేట్ చేయొద్దు. ఆ డబ్బులతో పేదలక, అనాధలకు సాయం చేయండి" -సూపర్‌స్టార్ రజనీకాంత్, హీరో