ఆరు పదుల వయసు దాటినా అదే స్టైల్, అదే జోరు.. కుర్రహీరోలకి ఏమాత్రం తగ్గకుండా నటనలో ఒదిగిపోతాడు సూపర్‌స్టార్ రజనీ. ఈ హీరో స్టార్డమ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు.
తాజాగా హిమాలయాల పర్యటన ముగించుకుని చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న రజనీకి అదే పరిస్థితి ఎదురైంది. సూపర్‌స్టార్ రాకతో విమానాశ్రయమంతా ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది. రజనీతో కలిసి ఫొటో దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎట్టకేలకు వారి నుంచి బయటపడి కారులో వెళ్లిపోయాడు. అయితే ఒక అభిమాని మాత్రం విమానాశ్రయం నుంచి రజనీ ఇంటి వరకు బైక్ మీద ఫాలో చేశాడు. ఇది గమనించిన సూపర్‌స్టార్ ఇంటికి చేరుకోగానే అతడిని పిలిచి అంత రాత్రి పూట కారును ఫాలో అవడం మంచిది కాదని, ప్రమాదాలు జరుగుతాయని స్మాల్ క్లాస్ ఇచ్చాడు. అంతేకాదు అతని కోరికను మన్నించి ఫొటో దిగే అవకాశం కల్పించాడు.