'దర్బార్' చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించనున్నాడు హీరో రజనీకాంత్. తాజాగా దీపావళి సందర్భంగా రజనీ మరో కొత్త లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో చేతిలో తుపాకీ పట్టుకుని స్టైలిష్ లుక్లో అదరగొడుతున్నాడీ సీనియర్ హీరో.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు పోస్టర్లలో కండలు పెంచి, పోలీసు అధికారిగా ఆకట్టుకున్నాడు రజనీ.