తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అతడికి రజనీ ఫోన్​ కాల్​.. ఏమి మాట్లాడారంటే? - rajnikanth ph cl to fan

సూపర్​స్టార్ రజనీకాంత్​.. అనారోగ్యంతో ఉన్న తన వీరాభిమానికి స్వయంగా కాల్​ చేసి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఆడియో కాల్​ నెట్టింట్లో వైరల్​గా మారింది.

Rajnikanth
రజనీ

By

Published : Sep 23, 2020, 8:43 PM IST

అవసరాల్లో ఉన్న వారికి సాయం చేయడంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆపన్నహస్తం అందించి, మంచితనం చాటుకున్నారు. ఆయన తాజాగా తన వీరాభిమానికి స్వయంగా ఫోన్‌ చేసి, సర్‌ప్రైజ్‌ చేశారు. ఆ ఆడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఎ.పి. ముత్తుమణికి రజనీ అంటే చాలా ఇష్టం. అందుకే 45 ఏళ్ల క్రితం ఆయన అభిమాన సంఘం ఏర్పాటు చేశారు. రజనీకి సంబంధించి ఫ్యాన్‌ క్లబ్‌ ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి ఆయన కావడం విశేషం. గత కొన్ని రోజులుగా ముత్తుమణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరడం వల్ల చెన్నైలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితిని అభిమాన సంఘాల ద్వారా తెలుసుకున్న రజనీ.. స్వయంగా ఫోన్‌ చేసి, ధైర్యం చెప్పారు.

గత 20 రోజులుగా మానసికంగా కుంగిపోయి ఉన్నానని తలైవాకు చెప్పారు ముత్తు. తొలుత మదురైలో చికిత్స జరిగిందని, ఆ తర్వాత చెన్నై ఆసుపత్రిలో చేరానని అన్నారు. త్వరలోనే కోలుకుంటావని, నీ కోసం ప్రార్థిస్తానని రజనీ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆయన భార్యతో కూడా రజనీ మాట్లాడారు. తన దైవంగా భావించే రజనీ ఫోన్‌ చేయడం వల్ల ఉత్సాహం వచ్చిందని ముత్తు చెప్పారట.

రజనీ ఈ ఏడాది 'దర్బార్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాకు ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. ప్రస్తుతం తలైవా అన్నాత్తై ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. సన్‌ పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తోంది.

ఇదీ చూడండి దీపిక, రకుల్, శ్రద్ధలకు ఎన్​సీబీ సమన్లు

ABOUT THE AUTHOR

...view details