Rajnikanth Aravind swamy movie: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. అంతేకాదు, దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగానూ రజనీకి పేరుంది. కానీ, ఆ దర్జాలూ, విలాసాలూ సినిమాలకే పరిమితం. నిజ జీవితంలో ఆయన చాలా సాదాసీదాగా ఉంటారని అభిమానులందరికీ తెలుసు. కానీ, అది ఏ స్థాయి నిరాడంబరతో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే.
రజనీ గురించి ఆ విషయం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!
Rajnikanth Aravind swamy: సూపర్‌స్టార్ రజనీకాంత్ నిజజీవితంలో ఎంత సింపుల్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, అది ఏ స్థాయి నిరాడంబరతో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓ సారి ఆయన ఉన్న విధానం చూసి ఆశ్చర్యపోవడం నటుడు అరవింద స్వామివంతైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
అది ‘దళపతి’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం. అరవిందస్వామికి అప్పుడప్పుడే వరుస అవకాశాలు వస్తున్నాయి. ఒక రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత అది రజనీకాంత్ ఉండే గది అని తెలియక లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆ గదిలో ఏసీ ఆన్ చేసి ఉండటంతో పక్కనే ఉన్న మంచంపై పడుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి లేచి చూసేసరికి రజనీ అదే గదిలో నేలమీద పడుకొని కనిపించారు. ఒక్కసారిగా గుండెలు గుభేలుమన్నాయి. నిద్రమత్తు ఒక్క దెబ్బకు వదిలిపోయింది. కంగారుగా బయటికి వెళ్లి యూనిట్ సభ్యులను విషయం ఏంటని ఆరాతీస్తే... "నిన్న రాత్రి షూటింగ్ అయ్యాక మీరు వచ్చి రజనీ సర్ గదిలో ఆయన మంచం మీద పడుకొన్నారు. మిమ్మల్ని చూసి ‘అతన్ని లేపొద్దు. అక్కడే పడుకోనీయండి’ అని అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పి ఆయన కూడా అక్కడే నేల మీద పడుకున్నారు" అని చెప్పడం వల్ల ఆశ్చర్యపోవడం అరవింద స్వామివంతైంది.
ఇదీ చూడండి: ప్రభాస్ సరసన 'పెళ్లిసందడి' బ్యూటీ.. వెబ్‌సిరీస్‌లో రామ్‌చరణ్!