సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'(rajinikanth annaatthe) సినిమాలోని మూడో పాట 'మరుధానీ' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(keerthy suresh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి(diwali 2021) కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా.
టైటిల్ టీజర్
కోలీవుడ్ హీరో విశాల్ నటించనున్న 32వ సినిమా(vishal latest movie 2021) టైటిల్ టీజర్ విడుదలైంది. లాఠీ అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. వినోద్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు(vishal new movie update). మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనుంది చిత్రబృందం.
విడుదల వాయిదా
తమిళ స్టార్ హీరో శింబు నటించిన 'మానాడు'(simbu maanadu movie release date) సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. నవంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించగా.. కళ్యాణి ప్రియదర్శన హీరోయిన్గా నటించింది.
రిలీజ్ డేట్ ఫిక్స్
ఆకాష్‌పూరి నటిస్తున్న 'రొమాంటిక్' సినిమా(romantic movie release date) రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 29న థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అనిల్పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్. ఈ మూవీకి దర్శకుడు పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రభాస్ అక్టోబర్ 19న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు.
న్యూలుక్ వైరల్
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌కు(mohanlal movies list) సంబంధించిన న్యూ లుక్ ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విపరీతంగా లైక్స్ కొడుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్.. 'మరక్కర్', 'ఆరాట్టు', 'రామ్', 'బరోజ్', 'బ్రో డ్యాడీ' సహా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
మోహన్‌లాల్ స్టైలిష్ లుక్
సాంగ్‌తో సూర్య
కథానాయకుడు సూర్య-దర్శకుడు టి.ఎస్.జ్ఞానవేల్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా 'జైభీమ్'(surya jai bhim movie release date). నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ఓ పవర్ఫుల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇదీచూడండి: బోల్డ్ హెయిర్‌స్టైల్‌లో శిల్పాశెట్టి.. అభిమానులు ఫిదా!