తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీకాంత్​ కొత్త సినిమా.. 'వలిమై' ట్రైలర్ రిలీజ్​ - రజనీకాంత్​ 169వ సినిమా

Cinema Updates: మరికొన్నికొత్త సినిమాల అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో అజిత్​ నటించిన 'వలిమై' ట్రైలర్​ సహా సూపర్​స్టార్​ రజనీకాంత్​ 169వ చిత్రం వివరాలు ఉన్నాయి.

Rajnikanth 169 movie
రజనీకాంత్​, అజిత్​ సినిమా

By

Published : Feb 10, 2022, 7:12 PM IST

Updated : Feb 11, 2022, 6:20 AM IST

Ajith Valimai movie trailer అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వలిమై' ట్రైలర్​ వచ్చేసింది. యాక్షన్​ సన్నివేశాలతో ఆద్యంతం ఈ ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. తమిళ స్టార్ హీరో అజిత్​ నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో త్వరలోనే విడుదల కానుంది. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా నటించగా, తెలుగు కథానాయకుడు కార్తికేయ విలన్​గా అలరించనున్నారు. ఈ మూవీకి హెచ్​ వినోద్​ దర్శకత్వం వహించగా.. హ్యుమా ఖురేషి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూర్చారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మించారు.

రజనీకాంత్​ కొత్త సినిమా

Rajnikanth 169 movie: గతేడాది నవంబరులో 'అన్నాత్తే' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన తమిళ సూపర్​స్టార్​ రజినీకాంత్​.. తన కొత్త సినిమాను ప్రకటించేశారు. దర్శకుడు నెల్సన్​ దిలీప్​కుమార్​తో తన 169వ చిత్రాన్ని చేయనున్నట్లు ట్వీట్​ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ సన్​పిక్చర్స్​. అనిరూధ్​ సంగీతం అందించబోతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ స్పెషల్​ వీడియోను పోస్ట్​ చేసింది. ఇందులో రజనీ కొత్త లుక్​ అదిరిపోయింది.

బలమైన కథతో పాటు ఆకట్టుకునే స్క్రీన్​ప్లేతో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ఏప్రిల్​ నెలాఖరు లేదా మే మొదటివారంలో ఈ సినిమా షూటింగ్​ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్​ దిలీప్​కుమార్.. మరో స్టార్​ హీరో విజయ్​తో 'బీస్ట్'​ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి: బిగ్​స్క్రీన్​పైకి 'శక్తిమాన్​'.. పవర్‌ఫుల్‌గా 'సన్‌ ఆఫ్‌ ఇండియా' ట్రైలర్

Last Updated : Feb 11, 2022, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details