కోలీవుడ్ స్టార్ సూర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల 'నవరస' వెబ్‌సిరీస్ పూర్తి చేసిన ఆయన.. 'కూటతిల్ ఒరుతన్' చిత్ర షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో సూర్య సరసన మలయాళ యంగ్ బ్యూటీ రజిష విజయన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
సూర్య సరసన మలయాళ యంగ్ బ్యూటీ! - movie news
సూర్య కొత్త చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందట మలయాళ యువ నటి రజిష విజయన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొడైకెనాల్లో సాగుతోంది.
![సూర్య సరసన మలయాళ యంగ్ బ్యూటీ! suriya Rajisha Vijayan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11627696-745-11627696-1620044099872.jpg)
సూర్య
ధనుష్ 'కర్ణన్' సినిమాతో తమిళ తెరకు పరిచయమైన రజిష.. కార్తి 'సర్దార్'లోనూ నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా సూర్యతో కలిసి పనిచేసే లక్కీ ఛాన్స్ కొట్టేసింది! జ్ఞాన్వేల్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య, గిరిజనుల తరఫున పోరాడే లాయర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం కొడైకెనాల్లో షూటింగ్ జరుగుతోంది.