తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మీ కళ్లను మోసం చేసే రజనీకాంత్ లుక్ - రజనీకాంత్ వార్తలు

ఈ ఫొటో చూడగానే కంప్యూటర్​ గ్రాఫిక్స్ అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకుంటే ఈ లుక్​ కోసం రజనీకాంత్.. ఏకంగా ముఖానికి సిల్వర్ పెయింట్ వేసుకున్నారు.

మీ కళ్లను మోసం చేసే రజనీకాంత్ లుక్
సూపర్​స్టార్ రజనీకాంత్

By

Published : Jun 26, 2020, 8:11 AM IST

తమిళ సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించిన సినిమా 'రోబో'. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సత్తా చాటింది. అయితే అప్పుడు ఫొటోషూట్‌లో తీసిన ఓ ఫొటోను సినిమాటోగ్రాఫర్‌ రిచార్డ్‌ ఎమ్‌ నతన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇంత వరకు ఈ లుక్‌ బయటికి రాలేదని పేర్కొన్నారు.

'2008లో 'రోబో' సినిమా ఫొటోషూట్‌లో నేను తీసిన స్టిల్‌ ఇది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో తలైవా లుక్‌ అలా తయారు చేశామని అందరూ అనుకున్నారు. కానీ ఈ షూట్‌ కోసం రజనీకి సిల్వర్‌ రంగు పెయింట్‌ వేశారు. ఇప్పటి వరకు విడుదల చేయని ఫొటో చూడండి..' అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details