తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీకాంత్​ 'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్' వచ్చేది అప్పుడే - 'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'

సూపర్​స్టార్​ రజనీకాంత్​ 'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్' ​ఎపిసోడ్​.. వచ్చే నెల 23న రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ట్విటర్​ ద్వారా వెల్లడించారు.

మ్యాన్​ వర్సెస్​ వైల్డ్ కార్యక్రమంలో బేరీగ్రిల్స్​తో రజనీకాంత్​

By

Published : Feb 27, 2020, 6:05 PM IST

Updated : Mar 2, 2020, 6:49 PM IST

రజనీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. ఆయన పాల్గొన్న 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' ఎపిసోడ్‌ ప్రసార తేదీని డిస్కవరీ ఛానల్‌ ప్రకటించింది. వచ్చే నెల 23న రాత్రి 8 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించింది. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో క్వాడ్రా సైకిల్​పై దూసుకొస్తూ కనిపించాడు తలైవా.

"అల్టిమేట్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సాహసవీరుడు బేర్ గ్రిల్స్​తో భారత్​లోని అడవుల్లో చేసిన సాహస కృత్యాలను చూసేందుకు సిద్ధమవండి. తలైవా ఆన్‌ డిస్కవరి"

-డిస్కవరీ ఛానల్​ ట్వీట్

ఈ ఎపిసోడ్‌ను కర్ణాటకలోని బండిపురా అడవుల్లో జనవరిలో చిత్రీకరించారు. ఈ కార్యక్రమంతో తలైవా.. తొలిసారిగా ఓ టీవీషోలో కనిపించనున్నాడు. ఇందులో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఇదొక మరిచిపోలేని అనుభవమని అభిమానులతో పంచుకున్నాడు రజనీ. ఈ షూట్‌లో తొలిరోజు రజనీకి గాయాలైనప్పటికీ, కోలుకొని తర్వాతి రోజే చిత్రీకరణలో పాల్గొన్నాడు. గతంలో రజనీకంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో కనిపించారు.

ఆ ఎపిసోడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించి రికార్డు సృష్టించినట్లు ఛానల్‌ పేర్కొంది. తాజాగా.. రజనీకాంత్‌ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి : ఆలీతో సరదాగా: తెలుగబ్బాయి విజయ్​తో ప్రేమ సంగతేంటి?

Last Updated : Mar 2, 2020, 6:49 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details