తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీ 'దర్బార్​' రిలీజ్.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ - Darbar movie tickets

సూపర్​స్టార్ 'దర్బార్' సినిమా విడుదల సందర్భంగా 'మై మనీ మంత్ర' సంస్థ.. తమ ఉద్యోగులకు సెలవుతో పాటు టికెట్లు ఇచ్చి సర్​ప్రైజ్​ చేసింది.

రజనీ 'దర్బార్​' రిలీజ్.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
దర్బార్​లో సూపర్​స్టార్ రజనీకాంత్

By

Published : Jan 7, 2020, 5:43 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే, అది ఎప్పుడైనా పండగ వాతావరణమే. మరి అదే సంక్రాంతి వస్తే ఆ హంగామాయే వేరుగా ఉంటుంది. ఈసారి అలానే రాబోతుంది. ఈ గురువారం ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సందర్భంగా ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

'మై మనీ మంత్ర' సంస్థ ప్రకటన

'మై మనీ మంత్ర' సంస్థ.. ఉద్యోగులకు 'దర్బార్' టికెట్లు కొనివ్వడం సహా, పెయిడ్ లీవ్​లు ప్రకటించింది. పొంగల్ బోనస్​తో పాటు ఈ సదుపాయం అందిస్తున్నామని పేర్కొంది. గురువారం సెలవిస్తున్నామంటూ సర్కులర్ విడుదల చేసింది. ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కొన్ని సంస్థలు రజనీ సినిమాల రిలీజ్​కు టికెట్లు పంచడం, సెలవు ఇవ్వడం చేశాయి.

'దర్బార్'లో సూపర్​స్టార్ రజనీకాంత్-సునీల్ శెట్టి

'దర్బార్'లో రజనీ.. ఆదిత్య అరుణాచలం అనే పోలీస్అధికారిగా కనిపించనున్నాడు. నయనతార హీరోయిన్. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ​

ABOUT THE AUTHOR

...view details