తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిర్మాత తిట్టాడన్న కసితోనే రజనీకాంత్ ఈ స్థాయికి

తన సినీప్రయాణంలో ఎదురైన కొన్ని బాధపెట్టే విషయాలను రజనీకాంత్ ఓ సమయంలో చెప్పారు. అయితే తనపై ఓ నిర్మాత చూపిన పొగరు కారణంగానే, కసితో ఈ స్థాయికి ఎదిగానని అన్నారు.

Rajinikanth was once humiliated and thrown out by a producer And He returned in a foreign car
'నిర్మాత తిట్టాడన్న కసితోనే ఈ స్థాయికి ఎదిగా!'

By

Published : Dec 12, 2020, 10:20 AM IST

"నా విజయంలో కృషి, పట్టుదల మాత్రమే కాదు.. దర్శకనిర్మాతలు కూడా ప్రధాన కారణం. జీవితంలో గెలవాలంటే సమయం, పరిస్థితులు అనుకూలించాలి" అని సూపర్​స్టార్​ రజనీకాంత్ అన్నారు‌. ఈ ఏడాది ప్రారంభంలో 'దర్బార్'​ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన సినీ ప్రయాణం ఎలా మొదలైంది? స్టార్​ హీరోగా ఎదగడం వెనుక కారణాల్ని వెల్లడించారు.

నమ్మకంతోనే తొలి ప్రయాణం...

"పదో తరగతి చదివేటప్పుడు ఇంట్లోవాళ్లు పరీక్షల ఫీజు కోసం రూ.150 ఇచ్చారు. అయితే పరీక్ష ఫెయిల్‌ అవుతానని నాకు తెలుసు. అందుకే మద్రాస్‌ రైలెక్కాను. టికెట్‌ ఎక్కడో పడిపోయింది. టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఆ విషయం చెప్పినా జరిమానా కట్టాల్సిందేనని అందరి ముందు అరిచాడు. అప్పుడు ఐదుగురు కూలీలు నాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నేను డబ్బుల్లేక టికెట్‌ తీసుకోలేదనుకుంటున్నారేమో. కానీ నేను టికెట్ తీసుకున్నానన్నది నిజం. ఆవిషయాన్ని టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌కు చెబుతున్నా నమ్మడం లేదని వాళ్లతో చెప్పా. ఆ మాటలు విన్న ఇన్‌స్పెక్టర్‌ నన్ను నమ్మాడు. అదే తొలిసారి ఓ తెలియని వ్యక్తి నన్ను నమ్మడం. ఆ తర్వాత మద్రాస్‌కు వచ్చాక కె.బాలచందర్‌ నాపై నమ్మకముంచారు. దాన్ని గెలిపించుకున్నాను. ఇప్పుడు ప్రజలు నామీద నమ్మకం పెట్టుకున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము కాదు" అని రజనీ అప్పుడు చెప్పారు.

వీటితో పాటు తన జీవితంలో జరిగిన ఓ బాధాకర సంఘటనను రజనీ వెల్లడించారు. ఆ కసి వల్ల వచ్చిన స్ఫూర్తితో ఏ విధంగా స్టార్​ అయ్యాడో చెప్పారు. "నా జీవితంలో ఓ బాధాకర ఘటన జరిగింది. '16 వయదినిలే' చిత్రం తర్వాత ఓ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానన్నారు. కానీ సెట్‌కు వెళ్లేవరకూ అడ్వాన్స్‌ ఇవ్వలేదు. డబ్బులు ఇస్తేనే నటిస్తానని తెగేసి చెప్పాను. అప్పుడాయన 'ఏరా నీకంత పొగరు. నీకు వేషం లేదు. ఇంటికి వెళ్లిపో' అని అరిచారు. చాలా బాధేసింది. ఆ కసితో వచ్చిన పట్టుదల వల్లే ఎదగాలనుకున్నాను. ఆ తర్వాత రెండున్నరేళ్లలో ఫారిన్‌ కారు కొన్నాను" అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details