'రజనీ.. మీరెప్పుడూ మా గుండెల్లో ఉంటారు' - రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
శనివారం సూపర్‌స్టార్ రజనీకాంత్ 70వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీతారలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. తలైవాపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు ఏమని ట్వీట్ చేశారో చూద్దాం.
రజనీకాంత్
ఎంతమంది హీరోలు వచ్చినా.. ఎవరెన్ని విన్యాసాలు చేసినా.. ఆయన స్టైల్‌కు ఫిదా అయిపోతారు.. ఒక్కసారి నడిస్తే ఆయన మేనరిజానికి పులకించిపోతారు ప్రేక్షకులు. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. శనివారం 70వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు అభిమానులు, పలువురు సినీ తారలు సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏమని ట్వీట్ చేశారో తెలుసుకుందాం.