సూపర్‌స్టార్ రజనీకాంత్.. కొవిడ్ రెండో డోసు వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన రజనీ కుమార్తె సౌందర్య.. అందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈయన వ్యాక్సిన్ వేయించుకున్నారు.
హీరో రజనీకాంత్‌కు కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు - కొవిడ్ వ్యాక్సిన్ టాలీవుడ్
'అన్నాత్తే' షూటింగ్ పూర్తి చేసి, ఇంటికి చేరుకున్న రజనీకాంత్.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ ఫొటోను సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్లో పంచుకుంది.
రజనీకాంత్
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో 'అన్నాత్తే' షూటింగ్లో గత కొన్నిరోజుల నుంచి విరామం లేకుండా పాల్గొన్నారు రజనీకాంత్. తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుని మే 12న చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నారు. 'అన్నాత్తే' .. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.