తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త సినిమా కోసం డైలాగ్స్ రాస్తున్న రజినీకాంత్? - Rajinikanth keerthy suresh

తన కొత్త చిత్రం కోసం, సూపర్​స్టార్ రజినీకాంత్ కొన్ని సంభాషణలు రాస్తున్నారని సమాచారం. లాక్​డౌన్​తో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుపెట్టనున్నారు.

Rajinikanth to turn writer for his next?
సూపర్​స్టార్ రజినీకాంత్

By

Published : Sep 28, 2020, 7:56 PM IST

సూపర్​స్టార్ రజినీకాంత్‌.. త్వరలో రచయితగా మారనున్నారట. ఏ డైలాగ్‌ అయినా అనర్గళంగా చెప్పే ఈయన.. ఈసారి తానే స్వయంగా వాటిని రాయనున్నారట. దర్శకుడు శివ రజినీతో 'అన్నాత్త' చిత్రం తీస్తున్నారు. ఇందులోని కొన్ని సంభాషణలు తలైవా అందిస్తున్నారని కోలీవుడ్​లో చాలా ప్రచారం జరుగుతుంది.

గతంలో 'బాబా' సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు రజినీ. ఇప్పుడు డైలాగ్స్‌ రాస్తున్నారనడం వల్ల అందరిలోనూ తెగ ఆసక్తి పెరిగింది. ఇది ఎంత నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్‌ హీరోయిన్లు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేశారు కానీ లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌ వాయిదా పడింది. త్వరలోనే చిత్రీకరణ తిరిగి ప్రారంభిస్తారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details