తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దాదాపు ఏడాది తర్వాత సెట్​లోకి రజనీ! - Annaatthe shooting

ఇటీవల అనారోగ్యం బారిన పడి, కోలుకుంటున్న తలైవా రజనీకాంత్.. వచ్చే నెల నుంచి 'అన్నాత్త' చిత్రీకరణకు హాజరు కానున్నారట. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.

Rajinikanth to resume Annaatthe shooting in March?
దాదాపు ఏడాది తర్వాత సెట్​లోకి రజనీ!

By

Published : Feb 10, 2021, 9:53 AM IST

సూపర్​స్టార్ రజనీకాంత్.. దాదాపు ఏడాది విరామం తర్వాత సెట్​లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 'అన్నాత్త' చిత్రంలో నటిస్తున్న ఆయన.. గతేడాది కరోనా లాక్​డౌన్​ వల్ల షూటింగ్​కు హాజరు కాలేకపోయారు. డిసెంబరులో హైదరాబాద్​లో తిరిగి మొదలైనా సరే, పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు.

ఇప్పుడు పరిస్థితులు సర్దుకుంటున్న నేపథ్యంలో రజనీకాంత్, త్వరలో సెట్​లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై ప్రకటన చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్, ఖుష్బూ, మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతమందిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తుండగా, సన్​ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబరు 4న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

ఇది చదవండి:నిజ జీవితంలోనూ రజనీ మారువేషాలు.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details