'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం ద్వారా బుల్లితెరలో అరంగేట్రం చేశాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. చిత్రీకరణలో తనకు సహాయాన్నందించిన బ్రిటీష్ సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌కు ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపాడు. ఈ అడ్వెంచర్ షోను చూడాలని తన అభిమానులను ట్విట్టర్లో కోరాడు. ఈ కార్యక్రమం సోమవారం రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్లో ప్రసారమైంది.
ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని బంధీపూర్ అడవిలో చిత్రీకరణ జరిపారు. అందులో బేర్‌గ్రిల్స్‌తో పాటు రజనీకాంత్ పాల్గొన్నాడు. ఆ సమయంలో అతడు గాయపడ్డాడు. ప్రధాని మోదీ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండో భారతీయుడు రజనీకాంత్.
తప్పుగా అర్ధం చేసుకున్నారు