తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీ సినిమా కథ లీక్​ అయ్యిందా?

సూపర్​ స్టార్​ రజనీకాంత్​, డైరెక్టర్​ శివ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం 'అన్నాత్తె. తాజాగా ఈ సినిమా కథాంశం సామాజిక మాధ్యమాల్లో లీక్​ అయినట్లు తెలుస్తోంది.

By

Published : Aug 2, 2020, 9:23 AM IST

Updated : Aug 2, 2020, 9:41 AM IST

Rajinikanth starrer 'Annaatthe' plotline leaked: Report
రజనీకాంత్​

'దర్బార్​' చిత్రంతో సూపర్​ హిట్​ అందుకున్న తమిళ సూపర్​ స్టార్​ రజనీకాంత్​. ఇప్పుడు 'అన్నాత్తె' సినిమాతో సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు. దీంతో మరోసారి తలైవా వెండితెరపై బ్లాక్​బాస్టర్​ అందిస్తారని అబిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా కథ ఆన్​లైన్​లో లీక్​ అయినట్లు తెలుస్తోంది.

చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రల పేర్లతో కూడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. 'వీర', 'విశ్వాసం' వంటి సూపర్ హిట్​ చిత్రాలనందించిన దర్శకుడు శివ.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్​, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ప్రకాశ్​రాజ్​, సూరి, సతీశ్​ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్​కు సంబంధించిన తొలి షెడ్యూల్​ రామోజీ ఫిల్మ్​ సిటీలో పూర్తిచేసుకుంది.

Last Updated : Aug 2, 2020, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details