గుండెపోటుతో(puneeth rajkumar death news) మరణించిన కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను(అప్పు) అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుచేసుకుంటున్నారు(puneeth rajkumar condolence). కొంతమంది బెంగళూరులోని అప్పు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.
తాజాగా పునీత్‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు సూపర్‌స్టార్ రజనీకాంత్(puneeth rajkumar rajinikanth). అప్పు లేరన్న నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. "నువ్వు లేవన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నీ ఆత్మకు శాంతి కలుగుగాక" అని రజనీ ట్వీట్ చేశారు.
రజనీపై విమర్శలు
రజనీ.. వాయిస్ ఆధారంగా పనిచేసే 'హూట్' అనే సోషల్‌మీడియా యాప్‌ను ఇటీవలే ప్రారంభించారు. దీనిద్వారానే పునీత్‌ను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "మీలాంటి లెజెండ్.. యాప్ ప్రమోషన్ కోసం సంతాపం తెలుపుతూ సందేశాలు ఇవ్వడం సరికాదు", "సంతాపం తెలుపుతున్నట్లు లేదు.. యాప్ ప్రమోషన్ చేస్తున్నట్లు ఉంది సార్" అంటూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
గుండెపోటుతో
అక్టోబర్ 29న ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్‌కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు(puneeth rajkumar heartattack). ఈ విషయం తెలియగానే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ పలు భాషలకు చెందిన నటీనటులు, అభిమానులు.. పునీత్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.
ఇదీ చూడండి: పునీత్ స్ఫూర్తితో.. నేత్రదానం కోసం 400 మంది దరఖాస్తు