కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-దర్శకుడు టి.ఎస్.జ్ఞానవేల్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా 'జైభీమ్'(surya jai bhim movie). నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది(surya jai bhim movie release date). ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్(jaibhim trailer)ను విడుదల చేసింది చిత్రబృందం. ఏ తప్పు చేయని బలహీన వర్గ మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు సూర్య. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.
సూర్య 'జైభీమ్' ట్రైలర్.. రజనీ 'పెద్దన్న' టీజర్ అప్డేట్ - రజనీకాంత్ పెద్దన్న మోషన్ పోస్టర్
సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మూవీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సూర్య 'జై భీమ్'(jaibhim trailer), రజనీకాంత్ 'పెద్దన్న', 'రామ్‌సేతు'(ramsetu poster) సినిమాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.
శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అన్నాత్తే'(rajinikanth new movie). తెలుగులో 'పెద్దన్న'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శనివారం సాయంత్రం 5 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'రామ్‌సేతు'(ram setu movie poster). జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఊటీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది చిత్రబృందం. ఇందులో అక్షయ్, సత్యదేవ్, జాక్వెలిన్ కనిపిస్తున్నారు.