>సూపర్‌స్టార్ రజనీకాంత్.. 'అన్నాత్త' షూటింగ్ కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ దర్శకుడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
శనివారం(డిసెంబరు 12) 71వ పుట్టినరోజు జరుపుకొన్న రజనీ.. త్వరలోనే తన రాజకీయ అరంగేట్రంపైనా ప్రకటన చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో అభిమానులందరిలోనూ ఆసక్తి మొదలైంది.
>రామ్ 'రెడ్' నుంచి 'కౌన్ హై లుచ్చా కౌన్ హై అచ్చా' అంటూ సాగే మాస్ గీతం విడుదలైంది. మణిశర్మ సంగీతమందించారు. తమిళ సినిమా 'తడమ్'కు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. మాళవిక, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకుడు. సంక్రాంతికి థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
>'క్రాక్'లోని 'భలే తగిలావే బంగారం' గీతం ప్రోమో విడుదలైంది. తమన్ సారథ్యంలో అనిరుధ్ పాడిన పూర్తి పాట.. సోమవారం(డిసెంబరు 14) ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ ఇందులో పోలీస్‌గా కనిపించనున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్. సంక్రాంతికే ఈ చిత్రం కూడా థియేటర్లలోకి రానుంది.
>మలయాళ సినిమాల డబ్బింగ్ వెర్షన్లను విడుదల చేస్తున్న ఆహా ఓటీటీ.. 'మాయనది' చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేయనున్నారు. టొవినో థామస్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లు.
ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన రజనీకాంత్