తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ అవార్డు వారికి అంకితమిస్తున్నా: రజనీ - దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు

దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు తనను వరించడంపై సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినీ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

Rajinikanth dedicates Dadasaheb Phalke
ఈ అవార్డు వారికి అంకితమిస్తున్నా: రజనీ

By

Published : Apr 1, 2021, 3:48 PM IST

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విశేషంగా చెప్పుకునే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనను వరించడంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తన ప్రయాణంలో తోడుగా సాగిన ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రజనీ ఓ ట్వీట్‌ చేశారు.

"సినిమా రంగంలో అత్యంత విలువైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రకాశ్‌ జావడేకర్‌, ఇతర జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్‌, నా స్నేహితుడు రాజ్‌ బహదూర్‌, పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడ్ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్‌, అలాగే ఈ రజనీకాంత్‌ను సృష్టించిన నా గురువు బాలచందర్‌తోపాటు.. నాకు జీవితాన్ని ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు, మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వన్‌, ప్రతిపక్ష పార్టీ నేత స్టాలిన్‌, కమల్‌హాసన్‌తోపాటు ఇతర రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్‌!!"

- రజనీకాంత్​, కథానాయకుడు

ఇటీవల కాలంలో బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ఈ పురస్కారం వరించింది. అలాగే దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్‌ (తెలుగు), నాగిరెడ్డి(తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు), శివాజీ గణేశన్‌(తమిళం), రాజ్‌కుమార్‌(కన్నడ), గోపాలకృష్ణన్‌(మలయాళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్‌(తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్‌(తెలుగు) ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు.

ఇదీ చూడండి:రజనీకాంత్​కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

'దాదాసాహెబ్' రజనీ గురించి ఈ విషయాలు తెలుసా?​

ABOUT THE AUTHOR

...view details