తమిళనాడులో పోలీసుల అమానుష చర్యలకు తండ్రీకొడుకులు బలైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ విషయంపై స్పందించి బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, సూపర్ స్టార్ రజనీ కాంత్ మృతులు జయరాజ్, ఫెనిక్స్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. జయరాజ్ భార్యతో ఫోన్లో సంభాషించిన తలైవా.. ఆమె ఆవేదనను పంచుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది ఆయన బృందం.
జయరాజ్ కుటుంబంతో రజనీ ఫోన్ సంభాషణ
పోలీసుల హింసాత్మక చర్యలకు తమిళనాడులో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో.. సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ బాధితుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
జయరాజ్ భార్యకు ఫోన్ చేసిన రజనీకాంత్
ఇటీవలే లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన కారణంగా జయరాజ్, అతని కుమారుడు ఫెనిక్స్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే జూన్ 23న వారిద్దరూ మరణించారు. పోలీసులు హింసించడం వల్లే జయరాజ్, ఫెనిక్స్లు చనిపోయారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
ఇవీ చదవండి: