కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా 'అన్నాత్తే'(annaatthe release date) రికార్డు సృష్టించింది. సుమారు 1193 విదేశీ స్క్రీన్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. చిత్ర బృందం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం విడుదలకానున్న దేశాలు, థియేటర్ల సంఖ్యను ప్రకటించింది.
యూఎస్‌ఏ(677), యూఏఈ (117), మలేసియా (110), శ్రీలంక (86), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (85), యూరప్ (43), యూకే(35), సింగపూర్ (23), కెనడా (17)లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది.