తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్​సిటీలో రజనీకాంత్ యాక్షన్ - rajinikanth movie news

తన కొత్త సినిమా షూటింగ్​లో సూపర్​స్టార్ రజనీకాంత్ బిజీగా ఉన్నారు. హైదరాబాద్​లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో ఈ చిత్రీకరణ సాగుతోంది.

rajinikanth annaatthe movie
రామోజీ ఫిల్మ్​సిటీలో రజనీకాంత్ యాక్షన్

By

Published : Apr 24, 2021, 6:19 AM IST

చుట్టూ ఓ 40 భారీ ట్రక్కులు.. లారీలు.. మధ్యలో రజనీ.. సన్నివేశం ఏమై ఉంటుందో అర్థమయ్యే ఉంటుంది కదా. అక్కడ భారీ యాక్షన్‌ సీన్‌. రజనీ తన మార్క్‌ స్టైల్‌తో దుమ్ము దులిపేస్తున్నారు. ఈ భారీ యాక్షన్‌ హంగామాకు రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. రజనీకాంత్‌ కథానాయకుడిగా శివ తీస్తున్న చిత్రం 'అణ్నాత్తే'. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. నయనతార, కీర్తి సురేశ్ హీరోయిన్లు.

ప్రస్తుతం ఈ సినిమాలోని భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఓ పెద్ద బంగ్లా.. ఆ ముందున్న మైదానంలో భారీ వాహనాల మధ్య రజనీకాంత్‌ తదితరులపై దిలీప్‌ మాస్టర్‌ నేతృత్వంలో యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

రజనీకాంత్‌ మార్క్‌ పోరాటాలు ఇందులో ఉంటాయని, అవి అభిమానులను అలరిస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజులు ఫిల్మ్‌సిటీలోనే 'అణ్నాత్తే' చిత్రీకరణ జరగనుంది. దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇది చదవండి:నిర్మాత తిట్టాడన్న కసితోనే రజనీకాంత్ ఈ స్థాయికి

ABOUT THE AUTHOR

...view details