తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్జీవీ' డాన్స్​కు హీరో రజనీకాంత్ రియాక్షన్..! - హీరో రజనీకాంత్

'ఇస్మార్ట్‌ శంకర్‌' సక్సెస్‌ పార్టీ చూసిన తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రియాక్షన్‌ చూడండి అంటూ ట్విట్టర్​లో ఓ ఫన్నీ వీడియో షేర్‌ చేశాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ.

రాంగోపాల్ వర్మ, రజనీకాంత్

By

Published : Jul 21, 2019, 5:12 PM IST

పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.36 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. శనివారం ఈ చిత్రబృందంతో సక్సెస్​ పార్టీ చేసుకున్నాడు దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. తమ సందడికి హీరో రజనీకాంత్​ స్పందన చూడండి అంటూ ఓ వీడియోనూ పోస్ట్​ చేశాడు.

'చంద్రముఖి' సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ను.. తమ పార్టీ సన్నివేశాలతో కలిపిన ఈ వీడియో నెటిజన్లను అలరిస్తోంది.

పూరీ జగన్నాథ్​ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో ఎనర్జిటిక్​ స్టార్​ రామ్ హీరోగా నటించాడు. నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా కనిపించారు. ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మించారు.

ఇది సంగతి: మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!


ABOUT THE AUTHOR

...view details