రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'అణ్ణాత్త'. ఈ సినిమాను 2021 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేశ్, ఖుష్బూ, మీనా తదితరులు నటిస్తున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తోంది. ఆయుధపూజ (దసరా) నాడు ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు.
సంక్రాంతి బరిలో సూపర్‌స్టార్- అజిత్‌తో తలైవా ఢీ! - annaththa movie release postponed
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అణ్ణాత్త'. ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసినట్లు నిర్మాణసంస్థ తాజాగా ప్రకటించింది.
మరోసారి సంక్రాంతి బరిలో సూపర్‌స్టార్!
అయితే చిత్రీకరణ, నిర్మాణానంతర పనుల్లో జాప్యం వల్ల సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లు సన్‌పిక్చర్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సంక్రాంతికే అజిత్ హీరోగా రూపొందుతోన్న 'వలిమై' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది సంక్రాంతికి కోలీవుడ్‌లో రజనీకాంత్ నటించిన 'పేట', అజిత్ 'విశ్వాసం' చిత్రాలు పోటీపడ్డాయి. మళ్లీ ఇప్పుడు తలాతో తలైవా ఢీ అంటునున్నాడు.
ఇదీ చూడండి..'గబ్బర్‌సింగ్' పక్కన ఛాన్స్ కొట్టేసిన మలయాళీ భామ!