తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సీమ యాసతో నవ్వించాడు... భయపెట్టాడు' - జయ ప్రకాశ్​ రెడ్డికి ప్రముఖుల నివాళి

జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తనను షాక్​కు గురిచేసిందని నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. స్టేజ్ ఆర్టిస్ట్​గా కెరీర్​ను ప్రారంభించి.. సినిమాల్లోకి వచ్చి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారన్నారు. ఒక మంచి నటుడిని కోల్పోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

rajendra-prasad-mourn-demise-of-jaya-prakash-reddy
'సీమ యాసతో నవ్వించాడు... భయపెట్టాడు'

By

Published : Sep 8, 2020, 3:35 PM IST

జయప్రకాశ్ రెడ్డి మరణవార్త విని చిత్రసీమంతా షాక్​లో ఉందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయనను ముద్దుగా జేపీ అనే పిలిచేవాళ్లమని... గుండెపోటుతో జేపీ దూరమవ్వడం చాలా బాధాకరమన్నారు. జేపీ అంటే ఎంతో అభిమానం అని... ఆయనను ఎప్పుడు కలిసినా ప్రసాదు.. ప్రసాదు అని ఎంతో ప్రేమగా పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. స్టేజ్ ఆర్టిస్ట్​గా కెరీర్​ను ప్రారంభించి... సినిమాలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు.

'సీమ యాసతో నవ్వించాడు... భయపెట్టాడు'

సీమ యాసతో కమెడియన్​గా నవ్వించి... విలన్​గా మెప్పించిన అద్భుతమైన నటుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఏ సినిమాలో అయినా... నిడివి చిన్నదే అయినా సరే అతని క్యారెక్టర్ ప్రేక్షకుడు గుర్తుంచుకునేలా నటించడం ఆయన గొప్పతనమని రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంచి నటుడిని తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:విలనిజం, హాస్యానికి కేరాఫ్​ అడ్రస్​ జయప్రకాశ్​ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details