సమాజ స్పృహ, జీవిత గాథల నేపథ్యంలో తెరకెక్కే కొన్ని చిత్రాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. తాజాగా తాప్సీ, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సాండ్ కీ ఆంఖ్' చిత్రానికి పన్ను మినహాయించినట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
'సాండ్ కీ ఆంఖ్'కి పన్ను మినహాయింపు - rajasthan government given tax exemption movie sand ki ankh
తాప్సీ, భూమీ పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సాండ్ కీ ఆంఖ్.' ఈ చిత్రానికి పన్ను మినాహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది రాజస్థాన్ ప్రభుత్వం.
"మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం" అని రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ప్రపంచంలోనే వృద్ధులైన షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ అనే ఇద్దరు మహిళ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్
కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు తుషార్ హీరానందని తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. సూర్య 'బందోబస్త్'కు 100 కోట్లు