కథానాయకుడు రాజశేఖర్ రంగంలోకి దిగబోతున్నారు. ఆయన కొత్త చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్' రీమేక్‌లో రాజశేఖర్ నటించబోతున్నారు. ఓ విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగుకు తగ్గట్టుగా మార్పులు చేసి స్క్రిప్టుని సిద్ధం చేశారు. లలిత్ అనే ఓ కొత్త కెప్టెన్‌కి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు.
కొత్త దర్శకుడితో రాజశేఖర్ చిత్రం! - లలిత్ దర్శకత్వంలో రాజశేఖర్
రాజశేఖర్ హీరోగా కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. లలిత్ అనే కొత్త దర్శకుడితో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు రాజశేఖర్.
కొత్త దర్శకుడితో రాజశేఖర్ చిత్రం!
త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణని ప్రారంభించడంతోపాటు, ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు. రాజశేఖర్ 'కల్కి' తర్వాత చేస్తున్న చిత్రమిదే. ఇటీవలే కరోనా బారినపడిన ఆయన కోలుకుని షూటింగ్‌లపై దృష్టిపెట్టారు.
Last Updated : Feb 3, 2021, 11:42 AM IST