ప్రముఖ నటుడు రాజశేఖర్ తన కొత్త సినిమాను ప్రకటించారు. తాజాగా 'మర్మాణువు' టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వం వహిస్తుండగా.. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చనున్నారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటిస్తామని తెలిపింది చిత్రబృందం.
రాజశేఖర్ కొత్త సినిమా.. డబ్బింగ్ పనుల్లో 'సీటీమార్' - seetimar movie dubbing
ప్రముఖ నటుడు రాజశేఖర్ తన కొత్త సినిమా 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మాహాతో చేయనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. గోపీచంద్, తమన్నా నటించిన 'సీటీమార్' చిత్రం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. దానికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు.
![రాజశేఖర్ కొత్త సినిమా.. డబ్బింగ్ పనుల్లో 'సీటీమార్' rajsekhar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11157026-1070-11157026-1616677924440.jpg)
రాజశేఖర్
కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతోన్న కొత్త చిత్రం 'సీటీమార్'. కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాలో.. గోపీచంద్ సరసన హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ వీడియోను నెట్టింట పంచుకుంది చిత్రబృందం.
ఫహాద్ ఫాజిల్ నటించిన మలయాళ సినిమా 'మాలిక్' ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా మే 13న విడుదల కానుందీ చిత్రం.