రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రం 'శేఖర్'. బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు సంక్రాంతి బరిలో దించనున్నట్లు సమాచారం.
Sekhar movie: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'? - సంక్రాంతి మూవీస్ రిలీజ్
'ఆర్ఆర్ఆర్' వాయిదా పడేసరికి చాలావరకు చిన్న చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇప్పుడా జాబితాలోకి 'శేఖర్' చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో క్లారిటీ రానుంది.
రాజశేఖర్ శేఖర్ మూవీ
ఇందుకు తగ్గట్లుగానే నిర్మాణాంతర పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వెండితెరపై సందడి చేస్తుందా.. ఓటీటీ బాట పడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్'కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రాజశేఖర్ వయసు పైబడిన వ్యక్తిగా సరికొత్త లుక్‌తో సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించారు. అను సితార, మస్కన్ సేతి హీరోయిన్లు.
ఇది చదవండి:సంక్రాంతికి సినిమాలే సినిమాలు.. కాకపోతే 'చిన్న' ట్విస్ట్