తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మలయాళీ సినిమా రీమేక్‌లో శివాత్మిక? - శివాత్మిక రాజశేఖర్​

నటి శివాత్మిక రాజశేఖర్​.. మలయాళంలో సూపర్​ హిట్​గా నిలిచిన 'కప్పేల' సినిమా తెలుగు రీమేక్​లో నటించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

sivatmika
శివాత్మిక

By

Published : Mar 3, 2021, 5:30 AM IST

'దొరసాని'తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి శివాత్మిక రాజశేఖర్‌. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మించనున్న ఓ చిత్రంలో నటించనుందని సమాచారం. మలయాళంలో విజయవంతమైన 'కప్పేల' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే ‘కప్పేల’ సినిమా చూసిన నాగవంశీ ఈ సినిమాలోని పాత్రకు శివాత్మిక అయితేనే బాగుంటుందని అనుకున్నారట. దాంతో ఆమెకు కథను కూడా వినిపించారట. అందుకు ఆమె అంగీకరించిందని సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

మలయాళంలో నటించిన శ్రీనాథ్‌ బసి, రోషన్‌ మాథ్యూస్‌ పాత్రల్లో తెలుగులో నటులు విశ్వక్‌ సేన్‌, నవీన్‌ చంద్రలను నిర్మాత సంప్రదించారట. మరోవైపు శివాత్మిక తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. హర్ష పులిపాక దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంకా పేరు ఖరారు చేయని ఓ చిత్రంలోనూ శివాత్మిక నటిస్తోంది.

ఇదీ చూడండి: 'దొరసాని' ముద్దుగుమ్మ హాట్ ​లుక్స్

ABOUT THE AUTHOR

...view details