'పీఎస్వీ గరుడవేగ'తో చాలాకాలం తర్వాత మళ్లీ హిట్ అందుకున్నాడు హీరో రాజశేఖర్. ఇటీవలే అదే ఊపుతో 'కల్కి' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మళ్లీ మరో సినిమాను పట్టలెక్కిస్తున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
ఎమోషనల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్లు ఎవరనేది త్వరలో చెప్పనుంది చిత్రబృందం.