Radheshyam Movie: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఇప్పటికే హిందీ వెర్షన్‌కు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక కన్నడలో శివరాజ్‌కుమార్, మలయాళంలో పృథ్వీరాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలిపింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటించింది. త్వరలో ప్రమోషన్స్ కూడా మరోసారి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పర్యటించనున్న చిత్రబృందం సినిమాపై హైప్ తీసుకురానుంది.
ఆహాలో డీజే టిల్లు..
ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన డీజే టిల్లు సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రసారంకానుంది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో సందడి చేయనుంది. విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సిద్ధుకు జంటగా నేహాశెట్టి నటించారు. శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకూర్చగా తమన్ నేపథ్యం సంగీతం అందించారు.