ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 8న విడుదల చేస్తున్నట్టు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. 2021 సంక్రాంతికి రాజమౌళి ముందుగానే కర్చీఫ్ వేసుకున్నారన్నమాట. రాజమౌళి సినిమా వస్తుందంటే, ఆ సీజన్‌లో మిగిలిన చిత్రాలకు అంతగా స్థానం లేనట్టే. సంక్రాంతికి రావాలని నిర్ణయించుకున్న కొన్ని చిత్రాలు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సీజన్‌లో శంకర్ సినిమా వస్తోంది. కమల్‌హాసన్ హీరోగా రూపొందిస్తున్న 'భారతీయుడు 2'ని సంక్రాంతి బరిలో నిలిపాడు శంకర్. జనవరి 14న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.
సంక్రాంతి బరిలో 'భారతీయుడు 2' x 'ఆర్‌ఆర్‌ఆర్' - రాజమౌళి, శంకర్ చిత్రాల్లో గెలిచేదెవరు?
దేశం గర్వించే దర్శకుల్లో శంకర్, రాజమౌళి పేర్లు తప్పకుండా ఉంటాయి. 'జెంటిల్‌మేన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'రోబో' చిత్రాలతో సంచలనం సృష్టించాడు శంకర్. సాంకేతిక హంగులు అద్దుతూనే, సామాజిక చైతన్యం కలిగిన అంశాల్ని కథలుగా ఎంచుకుని బాక్సాఫీసుని జయించాడు. మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకుని, కమర్షియల్ చిత్రాన్ని ఎంత అందంగా ముస్తాబు చేయొచ్చన్న కిటుకుని భలేగా కనిపెట్టేశాడు. వీళ్ల సినిమాల గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. రాబోయే సంక్రాంతికి వీరిద్దరి చిత్రాలూ బాక్సాఫీసు దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. రాజమౌళి, శంకర్ చిత్రాలు ఒకే సీజన్‌లో విడుదలవ్వటం ఇదే తొలిసారి.
సంక్రాంతి బరిలో 'భారతీయుడు 2', 'ఆర్‌ఆర్‌ఆర్'
దర్శకులుగా రాజమౌళి, శంకర్‌ల స్థాయి తెలియంది కాదు. వీళ్ల సినిమా అంటే బాక్సాఫీసు హోరెత్తిపోతుంది. థియేటర్లన్నీ నిండిపోతాయి. వీరి సినిమాలు వారం రోజుల వ్యవధిలో వస్తుండటంతో థియేటర్లు కళకళలాడనున్నాయి. మిగిలిన సినిమాల మాటెలా ఉన్నా, ఈ రెండు చిత్రాలపైనే పరిశ్రమ దృష్టి ఉంటుంది. ఈ రెండూ పాన్ ఇండియా చిత్రాలు. ఈ సినిమాల మధ్య జరిగే పోటీ ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదీ చూడండి..విజయ్ 'బిగిల్' టీమ్‌పై ఐటీ గురి- 65కోట్లు సీజ్
Last Updated : Feb 29, 2020, 12:04 PM IST