తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అయ్యో.. జక్కన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్‌ కొట్టేశారట!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్​చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్​ను ఎవరో కాపీ కొట్టేశారట. అదేంటో చూడండి.

rajamouli
జక్కన్న

By

Published : Dec 18, 2019, 6:15 AM IST

'బాహుబలి' వంటి హిట్‌ సిరీస్‌ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి నుంచి రాబోతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌ ఇప్పటికే 75శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాబోయే నూతన సంవత్సర కానుకగా చిత్ర ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే అధికారికంగా చిత్ర బృందం టైటిల్‌ను ప్రకటించక ముందే ఈ సినిమా టైటిల్‌ను మరో నిర్మాణ సంస్థ ఎత్తుకెళ్లిపోయిందట. అదేంటి.. అలా ఎలా జరిగిపోయింది అని కంగారు పడకండి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్ర టైటిల్‌ కోసం రాజమౌళి ప్రేక్షకులకు ఓ పోటీ పెట్టాడు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వర్కింగ్‌ టైటిల్‌కు సరిగ్గా సరిపోయేలా పూర్తి పేరును సూచిస్తే బాగున్న వాటిలో నుంచే ఓ టైటిల్‌ను ఖరారు చేస్తామని అప్పట్లో ప్రకటించింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినీప్రియుల నుంచి అప్పట్లో రకరకాల పేర్లు వచ్చాయి. అయితే వీటిలో ఎక్కువ మందిని ఆకర్షించిన పేరు 'రామ రావణ రాజ్యం'. ఈ టైటిల్‌నే జక్కన్న ఫిక్స్‌ చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పుడీ టైటిల్‌ను వి3 ఫిలింస్‌ అనే సంస్థ తమ పేరిట రిజిస్టర్‌ చేయించేసుకుంది. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఈ పేరుకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సదరు సంస్థ ఫిలిం ఛాంబర్‌లో ముందుగానే దీన్ని రిజిస్టర్‌ చేయించేసుకుందట. మొత్తానికి ఇలా జక్కన్న టైటిల్‌ను వి3 ఫిలింస్ సంస్థ ముందుగానే కొట్టేసిందన్న మాట. మరి 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు రాజమౌళి అనుకుంటున్న పేరేంటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ చిత్రానికి 'రౌమ రౌద్ర రుషితం' అన్న పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి.. అప్పుడు 'రంగస్థలం'.. ఇప్పుడు 'రంగమార్తాండ'

ABOUT THE AUTHOR

...view details